గ్రేటర్‌ వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ వరంగల్‌

Published Sat, Jun 15 2024 1:40 AM | Last Updated on Sat, Jun 15 2024 1:40 AM

గ్రేట

(హనుమకొండ – వరంగల్‌)
శనివారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2024

7

రెడ్‌క్రాస్‌ సేవలు అభినందనీయం

కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

హన్మకొండ అర్బన్‌: అత్యవసర సమయాల్లో ముందుంటూ జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రజ లకు అందిస్తున్న సేవలు అభినందనీయమని హనుమకొండ కలెక్టర్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ అధ్యక్షురాలు సిక్తా పట్నాయక్‌ అన్నారు. ప్రపంచ రక్తదాతల దినో త్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం హనుమకొండ జిల్లా రెడ్‌ క్రాస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీలోని జనరిక్‌ మందుల షాప్‌, తలసేమియా సెంటర్‌ను సందర్శించి పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. తలసేమియా బాధితులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్త గ్రూప్‌లను కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్‌ ల్యాండ్‌ స్టినేర్‌ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మాట్లాడుతూ.. జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ రక్త కేంద్రం, తలసేమియా సెంటర్‌, జనరిక్‌ మెడికల్‌ షాపు నిర్వహణలో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో ఉండడం అభినందనీయమన్నారు. అనంతరం పలువురు రక్తదాతలకు కలెక్టర్‌, పాలకవర్గం చేతుల మీదుగా శాలువాలతో సత్కరించి ప్రశంసపత్రాలు, షీల్డులు బహూకరించారు. కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.విజయ్‌చందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ పెద్ది వెంకటనారాయణగౌడ్‌, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, జిల్లా పాలకవర్గ సభ్యులు పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, పుల్లూరు వేణుగోపాల్‌, సీహెచ్‌ సంధ్యారాణి, బాశెట్టి హరిప్రసాద్‌, రక్తదాతలు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
గ్రేటర్‌ వరంగల్‌1
1/2

గ్రేటర్‌ వరంగల్‌

గ్రేటర్‌ వరంగల్‌2
2/2

గ్రేటర్‌ వరంగల్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement