కేయూలో విజిలెన్స్ అధికారుల విచారణ
కేయూ క్యాంపస్: కేయూ మాజీ వీసీ ప్రొఫెసర్ రమేశ్ హయాంలో వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా విజిలెన్స్‌మెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ రాకేశ్ బృందం శుక్రవారం యూనివర్సిటీలో విచారణ జరిపింది. వీసీ చాంబర్‌లో వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి, కేయూ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి సమక్షంలో విజిలెన్స్ అధికారులు పలు విషయాలపై సమాచారం తెలుసుకున్నారు. ప్రధానంగా 2021–22 పీహెచ్‌డీ అడ్మిషన్లకు సంబంధించిన సమాచారాన్ని అడిగినట్లు తెలిసింది. పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవకతవకలు జరి గాయనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. పీహెచ్‌డీ అడ్మిషన్లకు సంబంధించిన సీట్‌మాట్రిక్స్ గురించి అడిగినట్లు సమాచారం. పీహెచ్‌డీ అడ్మిషన్లకు సంబంధించి వివిధ విభాగాల డీన్‌లను కూడా వీసీ, రిజిస్ట్రార్లు వీసీ చాంబర్‌కు పిలిపించారు. అందుబాటులో ఉన్న డీన్‌లు కూడా వచ్చారు. విజిలెన్స్ అధికారులు అడిగిన పీహెచ్‌డీ అడ్మిషన్లపై వారు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అయితే వారు అడిగిన డాక్యుమెంట్లు కూడా ఇవ్వాల్సి ఉందని సమాచారం. అడ్జెంట్ ఫాక్యల్టీ నియామకాలపై కూడా సమాచారం అడిగినట్లు తెలిసింది. విజిలెన్స్‌మెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇతర అంశాలపై కూడా అడిగిన విషయాలపై సంబంధిత సెక్షన్ అధికారుల నుంచి వివరాలు అడిగినట్లు తెలిసింది. కాగా.. శనివారం వివిధ విభాగాల డీన్‌లతో వీసీ సమావేశం కానున్నారు. పీహెచ్‌డీ అడ్మిషన్ల డాక్యుమెంట్లు తీసుకురావాలని ఆదేశించారు.
భద్రకాళి చెరువు మట్టి విక్రయం
వరంగల్ అర్బన్: భద్రకాళి చెరువులో పూడికతీత మట్టిని ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం విక్రయిస్తున్నట్లు ఇరిగేషన్ ఈఈ బి.సీతారాం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక ఘణపు మీటరుకు రూ.144 చెల్లించి మట్టి కావాల్సిన వాళ్లు కొనుగోలు చేయాలని కోరారు. ఇతర వివరాల కోసం హనుమకొండ నక్కలగుట్ట బల్దియా ఇంజనీరింగ్ కార్యాలయంలో ఈనెల 30వ తేదీలోగా సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాల కోసం 90001 72854 మొబైల్ నంబర్‌కు ఫోన్ చేయాలని ఈఈ సీతారాం సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment