పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలు సుమలత విద్యార్థులతో కల్పనాచావ్లా పేరిట సైన్స్ క్లబ్‌ను ప్రారంభింపజేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల నుంచి నూతన ఆలోచనలు స్వీకరిస్తూ వాటి ద్వారా నూతన ఆవిష్కరణలకు రూపం ఇస్తున్నారు. గ్రామంలో ప్లాస్టిక్ నివారణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మూఢనమ్మకాలు, కరోనా కల్లోలం వంటి సైన్స్ నాటికలు ప్రదర్శించి జాతీయస్థాయిలో బహుమతులు అందుకున్నారు. ఇదే విధంగా ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో విద్యార్థులు ప్రతీ నెలా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి శాసీ్త్రయ దృక్పథం కలిగిన విద్యార్థులను తయారు చేయడంలో పాఠశాల ముందు వరుసలో నిలుస్తోది.
Comments
Please login to add a commentAdd a comment