
ప్రయోగాల పాఠశాల..
నూతన ఆవిష్కరణలతో ముందుకెళ్తున్న నాచినపల్లి ప్రభుత్వ పాఠశాల
దుగ్గొండి: సైన్స్.. పుస్తకంలోని పాఠం కాదు. సమాజంలోని మూఢ నమ్మకాలను దూరం చేసే శాస్త్రం. విద్యార్థుల్లోని ఆలోచన శక్తిని పెంచడంతోపాటు నూతన ఆవిష్కరణల వైపు వారి దృష్టిని మరల్చడం.. ప్రశ్నించే తత్వం అలవర్చడ సైన్స్ లక్ష్యం. సరిగా ఇదే లక్ష్యంతో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముందుకెళ్తోతుంది. నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తూ కార్పొరేట్‌కు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు సుధీర్‌కుమార్, వెలిదండి సుమలత ప్రోత్సాహంతో విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. ఇంటింటా ఇన్నోవేటర్ పోటీల్లో ఈజీ ప్యాడీ ఫిల్లింగ్ మిషన్ జిల్లా ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుని విలేజ్ ఇన్నోవేటర్ అవార్డును సొంతం చేసుకుంది. ఇదే పాఠశాల నుంచి ఏటీబీ.. ఏనీటైం బ్యాగ్ మిషన్ కేంద్ర మంత్రిత్వశాఖ నిర్వహించే స్టూడెంట్ ఇన్నోవేషన్ మారథాన్‌లో జాతీయస్థాయి గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో నేడు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఆ పాఠశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం
నేడు సైన్స్ దినోత్సవం
విద్యార్థుల ఎగ్జిబిట్లతో కార్పొరేట్‌కు దీటుగా
దేశవ్యాప్త గుర్తింపు పొందుతున్న స్కూల్
సైన్స్ ఉపాధ్యాయులు సుధీర్‌కుమార్, సుమలత ప్రోత్సాహంతో విద్యార్థుల ఆవిష్కరణలు
Comments
Please login to add a commentAdd a comment