
నైపుణ్యాలతో విద్యావకాశాలు
● కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి
కేయూ క్యాంపస్ : నైపుణ్యాలతోనే విద్యార్థులకు విద్యావకాశాలు లభిస్తాయని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం కేయూ సెనేట్ హాల్‌లో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.ప్రసాద్ అధ్యక్షతన ‘ఎక్స్‌ప్లోరింగ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఇన్ ది యూఎస్ ’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో వీసీ ప్రతాప్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు అంకితభావం, పట్టుదల, మార్పుకు సిద్ధంగా ఉండడం లాంటి అంశాలతో లక్ష్యం సాధించొచ్చన్నారు. వర్సిటీలో అకడమిక్‌తో పాటు పూర్తి స్థాయి నైపుణ్యాల పెంపు దిశగా పనిచేస్తున్నామని వివరించారు. అనంతరం హైదరాబాద్‌లోని యూఎస్ కన్సలేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ అమెరికాలో విద్యార్థులకు అద్భుత విద్యావకాశాలు ఉన్నాయన్నారు. టీచింగ్‌లో నూతన టెక్నాలజీ వినియోగం పెరిగిందన్నారు. అమెరికాలో ఉన్నత విద్యతో విద్యార్థి జీవితం మారుతుందన్నారు. టెక్నాలజీ సాయంతో స్కిల్, టాలెంట్ పెంచుకోవాలన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఓఎస్‌డీ పి.మల్లారెడ్డి, పాలక మండలి సభ్యులు రాము, చిర్ర రాజు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.రమణ, భిక్షాలు, బయో టెక్నాలజీ విభాగాధిపతి శాసీ్త్ర, తదిరులు పాల్గొన్నారు.
‘అకుట్’ జనరల్ సెక్రటరీ
పదవికి ఇద్దరు పోటీ
● ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం (అకుట్) ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రం ముగిసింది. అధ్యక్ష పదవికి ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి.వెంకట్రామ్‌రెడ్డి, జీయాలజీ విభాగం ప్రొఫెసర్ ఆర్.మల్లికార్జున్‌రెడ్డి పోటీ పడుతున్నారు. జనరల్‌సెక్రటరీ పదవికి బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.శ్రీనివాస్, మ్యాథమెటిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్‌పీ.రాజ్‌కుమార్ బరిలో నిలిచారు. పరిపాలనాభవనంలోని సెనేట్‌హాల్‌లో మార్చి 4న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. 5న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. కేయూ పరిధిలో 77 మంది అధ్యాపకులు ఓటర్లుగా ఉన్నారు.

నైపుణ్యాలతో విద్యావకాశాలు
Comments
Please login to add a commentAdd a comment