
సైన్స్ టాలెంట్ టెస్టులో విష్ణువర్ధన్‌కు ద్వితీయ స్థాన
మహబూబాబాద్ అర్బన్ : సైన్స్ టాలెంట్ టెస్టులో మహబూబాబాద్ మండలం మాధావపురం జెడ్పీహెచ్‌ఎస్ పదో తరగతి విద్యార్థి నక్క విష్ణువర్ధన్ రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు. ‘నిత్య జీవితంలో సైన్స్ ఉపయోగాలు’ అనే అంశంపై ఈ 18వ తేదీన హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయిలో సైన్స్ టాలెంట్ టెస్టు నిర్వహించారు. ఇందులో ధ్వని అనే పాఠంతో నాటి రేడియో నుంచి.. నేటి సెల్‌ఫోన్ వరకు పని చేస్తున్నాని, విద్యుత్ పాఠంతో చీకటిగా ఉన్న భూగోళాన్ని వెలుతురుగా మార్చి ప్రతి ఇంటిలో వెలుగులు నిండాయని, న్యూటన్ గమన నియమాల ద్వారా రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపగలుగుతామని, బేర్నౌలి సూత్రం ద్వారా రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్నారని, ఆక్సిజన్ కనుగొనడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను బతికించగలుగుతామనే, తదితర అంశాలను క్షుణ్ణంగా వివరించారు. దీంతో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ నెల 25వ తేదీన హైదరాబాద్‌లో ఎస్‌సీఈఆర్ డైరెక్టర్ రమేశ్ చేతుల మీదుగా విష్ణువర్ధన్ బహుమతి అందుకున్నాడు. కాగా, భౌతికశాస్త్రం ప్రణాళిక ప్రకారం చదివితే సులువుగా నేర్చుకొవచ్చని ఉపాధ్యాయులు తెలిపారని విష్ణువర్ధన్ చెప్పాడు. పాఠాలు విన్న తర్వాత ఇంటికెళ్లి చదువుతానన్నాడు. దీంతో భౌతికశాస్త్రం సులువుగా అర్థమవుతోందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment