
No Headline
మహబూబాబాద్ రూరల్ : మానుకోట రైతుకు దేశవ్యాప్త గుర్తింపు లభించింది. మహబూబాబాద్ మండలం చోక్ల తండా జీపీ పరిధి మేగ్యా తండాకు చెందిన బోడ వీరన్న జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. బెంగుళూరులోని ఐసీఏఆర్ ప్రధాన కేంద్రంలో గురువారం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్, లేబర్, ఎంప్లాయిమెంట్ శాఖల మంత్రి సుశ్రీశోభా కరండ్లజే చేతుల మీదుగా వీరన్న అవార్డు స్వీకరించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో సాగు చేసిన రైతు బోడ వీరన్న.. మల్యాల జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు నాగరాజు, ప్రశాంత్ ద్వారా సూచనల ద్వారా అద్భుత ఫలితాలు సాధించాడు. షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళికలో భాగంగా బెంగుళూరు భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన అర్క తేజస్వి మిరప రకాన్ని 2024 ఖరీఫ్‌లో పండించి ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి సాధించాడు. దేశ వ్యాప్తంగా భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ ఎంపిక చేసిన 14 మంది ఉత్తమ ఉద్యాన రైతుల్లో బోడ వీరన్న ఒకరు. కాగా, వీరన్న పలువురు మిరప రైతులకు ఆదర్శంగా నిలిచాడని జిల్లా వాసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment