ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవ్వాలి
● జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న
హన్మకొండ: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈదురు వెంకన్న పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం జాప్యం చేస్తోందన్నారు. యాజమాన్యానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెడుతోందని.. ఇప్పటికే యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. ఏక్షణమైనా సమ్మెకు వెళ్లొచ్చని.. కార్మికులంతా సమాయత్తం కావాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ జయశ్రీ, కన్వీనర్ ఎం.శ్రీనివాస్, వైస్ చైర్మన్ సీహెచ్.యాకస్వామి, నాయకులు జి.ఎస్.పాణి, బి.జనార్దన్, ఎ.మురళి, టీ.శ్రీనివాస్, జి.అశోక్, ఎ.యాదగిరి, ఆర్.మొగిలి, మంద శ్రీనివాస్, ఎం.రవీందర్, పసునూరి రవీందర్, వెంకటేశ్వర్లు, సునీత, సంపత్, పద్మ, రజిత, సవిత, మంజుల, ఎం.శ్రీను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment