బాలికల గురుకులంలో కమిషనర్ రాత్రిబస
మడికొండ: గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ మడికొండ శివారులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే గురువారం రాత్రి సందర్శించారు. విద్యార్ధుల హాజరు రిజిస్టర్, కళాశాల రికార్డులను ప రిశీలించారు. ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి, బోధన సిబ్బందితో సమావేశమై వివరాలు అడిగి తెలు సుకున్నారు. విద్యార్ధుల స్టడీ అవర్స్ కొనసాగుతుండగా విద్యార్థులతో మాట్లాడి భోజనం, రోజువారీ దినచర్య, మెనూ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి రా త్రి భోజనం చేశారు. పాఠశాలలోనే నిద్రించారు. కమిషనర్ వెంట ఉప కమిషనర్ ప్రసన్నరాణి, వైస్ ప్రిన్సిపల్ మాలిక తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment