ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ ఆర్ట్స్ కాలేజీ ఎదుట డిసెంబర్ 18న కృతజ్ఞత మహాసభను నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవత రాయ్ తెలిపారు. గురువారం ఆర్ట్స్ కాలేజీ ఎదుట సభ విజయవంతం కోసం రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీతో పాటు విద్యార్థులకు 40 శాతం కాస్మొటిక్, డైట్ చార్జీల పెంపు, స్కిల్ వర్సిటీ ఏర్పాటు స్పోర్ట్స్ వర్సిటీ స్థాపనకు చర్యలు తీసుకుందన్నారు. విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మహాసభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బైరి నాగరాజుగౌడ్, రెడ్డి శ్రీను, భీమ్రావ్ నాయక్, పట్ల నాగరాజు, క్రాంతి, నగేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment