కనెక్షన్ లైన్ కట్..!
సిల్ట్ చాంబర్లు
లేకుంటే
సాక్షి,సిటీబ్యూరో: వాణిజ్య భవన సముదాయాలు సిల్ట్ చాంబర్లు తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలని లేనిపక్షంలో సీవరేజ్ పైప్‌లైన్ కనెక్షన్లను తొలగించాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి సంబందిత అధికారులను అదేశించారు. గురువారం ఆయన 90 రోజుల స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మోహిదీపట్నం, లంగర్ హౌస్ తదితర ప్రాంతాల్లో డీ–సిల్టింగ్ పనులను పరిశీలించారు. మెహిదీపట్నం అంబా థియేటర్ వద్ద ప్రధాన రహదారిపై తరచూ పొంగుతున్న మ్యాన్ హోళ్లను పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లోని హోటళ్ల యాజమానులు తమ సీవరేజ్ పైప్ లైన్లను నేరుగా జలమండలి సీవరేజ్ నెట్‌వర్క్ కు అనుసంధానం చేసినందునే వాటి నుంచి వచ్చే ఆహార, వ్యర్థ పదార్థాలు మ్యాన్ హోళ్లలో చేరి సమస్య ఎదురవుతుందన్నారు. ఈ నేపథ్యంలో హోటళ్లు, బేకరీలు, ఫుడ్ కోర్టులు, వాణిజ్య భవనాల యజమానులకు సిల్ట్ చాంబర్లు నిర్మించుకోవాలని నోటీసులు జారీ చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే వారి సీవరేజ్ పైపు లైన్ కనెక్షన్లను తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీజీఎం వినోద్ భార్గవ, జీఎం, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.
సిల్ట్ చాంబర్ల ఏర్పాటు తప్పనిసరి
డీ–సిల్టింగ్ స్పెషల్ డ్రైవ్ పనుల పరిశీలన
జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment