దేశ ఆర్థికాభివృద్ధిలో విద్య పాత్ర కీలకం
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
రాంగోపాల్‌పేట్: దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గురువారం సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ సెంటినరీ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్ ఎంప్రెసా–24ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉన్నత విద్యాధికులతో పాటు మేధోశక్తి పెరిగితే ఆ దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. దేశంలో భిన్న మతాలు, ప్రాంతాలు, భాషలు ఉన్నా మనమంతా భారతదేశ పౌరులమేనన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్చ్ బిషప్, కార్డినల్ పూల ఆంథోని, కళాశాల డైరెక్టర్ డాక్టర్ పి.ఆంథోని వినయ్, ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్, ఉస్మానియా యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ కళాశాల డీన్ ప్రొఫెసర్ శ్రీరాములు, విద్యాసాగర్, మిన్నీ మ్యాథ్యూ, చేతన్ శ్రీవాత్సవ్, కున్నుంకల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment