
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ కోర్డోఫాన్ ప్రావిన్స్‌లో బంగారు గని కూలిపోవడంతో 38 మంది మరణించారు. ప్రమాదంలో మరో 8 మంది వరకు గాయపడ్డారని, వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సూడాన్ ప్రభుత్వ మినరల్ రిసోర్సెస్ కంపెనీ తెలిపింది.
సూడాన్ రాజధాని ఖార్టూమ్‌కు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుజా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ గనిని గత కొంతకాలం క్రితమే ప్రభుత్వం మూసివేసింది. సూడాన్ ప్రభుత్వం గనుల్లో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడమే వరుస ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, సూడాన్ దేశం 2020లో సుమారు 36.6 టన్నుల బంగారాన్ని వెలికితీసింది.
Comments
Please login to add a commentAdd a comment