ఈ–పాస్ ద్వారానే ఎరువులు విక్రయించాలి
మల్లాపూర్: రైతులకు ఈ–పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని డీఏవో రామచందర్ అన్నారు. మండలకేంద్రంతోపాటు సాతారం, సిరిపూర్, మొగిలిపేట, రాఘవపేట గ్రామాల్లో ఏవో లావణ్యతో కలిసి ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. స్టాక్ రిజస్టర్, ఈ–పాస్ మిషన్లను పరిశీలించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసినా.. అమ్మినా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని, వాటిని పంట పూర్తయ్యేవరకూ భద్రపరుచుకోవాలని కోరారు. ఏఈవో గజానంద్ తదితరులు పాల్గొన్నారు.
యాంటీబయటిక్స్ అతిగా వాడొద్దు
జగిత్యాల: రోగులు అతిగా యాంటీబయటిక్స్ వాడకూడదని, వాడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హేమంత్ అన్నారు. గురువారం ఐఎంఏ హాల్‌లో యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహించారు. యాంటీబయటిక్స్ వాడటంద్వారా దీర్ఘకాలికంగా ఇబ్బందులు కలుగుతాయని, మోతాదుకు మించి వాడొద్దని, నియంత్రణే మార్గమని సూచించారు. అనంతరం ఉత్తమ సేవలందిస్తున్న పలువురు వైద్యులకు ప్రశంసపత్రాలు అందజేశారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురువారెడ్డి, అర్చన పాల్గొన్నారు.
జూనియర్ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉపాధ్యాయుడు
రాయికల్: రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సిరిపురం మహేశ్ జూనియర్ లెక్చరర్ పోస్టుకు ఎంపికయ్యాడు. మహేశ్ మండలంలోని భూపతిపూర్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. టీజీపీఎస్సీ విడుదల చేసిన జూనియర్ లెక్చరర్స్ ఫలి తాల్లో ప్రతిభ కనబర్చాడు. ఆయనను గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు.
రైతుల వివరాలు నమోదు వేగవంతం చేయాలి
రాయికల్: ధాన్యం కొనుగోలు చేసిన రైతుల వివరాల నమోదును వేగవంతం చేయాలని జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని అల్లీపూర్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపు రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసేలా ఓపీఎంఎస్ వివరాలు నమోదు చేయాలన్నారు. తహసీల్దార్ ఖయ్యూం, సింగిల్ విండో చైర్మన్ రాజలింగం, సీనియర్ ఇన్‌స్పెక్టర్ స్వప్న, ఏఈవో సుమలత, కార్యదర్శి ఉపేందర్ పాల్గొన్నారు.
రుణమాఫీ అయిన రైతులకు మళ్లీ రుణాలు
మల్లాపూర్: రుణమాఫీ అయిన రైతులకు త్వరలోనే మళ్లీ రుణాలు అందిస్తామని మనోజ్‌కుమార్ అన్నారు. మండలంలోని చిట్టాపూర్, ముత్యంపేట సహకార సంఘాలను తనిఖీ చేశారు. రుణమాఫీ ఖాతాలు, ఫర్టిలైజర్స్ స్టాక్ రిజస్టర్లను పరిశీలించారు. ఆయన వెంట నోడల్ అధికారి ఎండీ.కలీం, ప్యాక్స్ సీఈవోలు రమేశ్, రవితేజ, సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ నుంచి కాచిగూడకు ప్రత్యేక రైలు
మెట్‌పల్లి: కరీంనగర్ నుంచి కాచిగూడకు ఈనె ల 24, 25, 26, 28 తేదీల్లో ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కరీంనగర్ నుంచి ఉదయం 6గంటలకు ప్రారంభ మై జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల మీదుగా కాచిగూడకు మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుంటుందన్నారు. తిరిగి మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరి కరీంనగర్‌కు రాత్రి 11.55 గంటలకు చేరుకుంటుందని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment