ఘనంగా భరణి నక్షత్ర వేడుకలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం యమధర్మరాజు ఆలయంలో గురువారం భరణి నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితులు బొజ్జ రమేశ్ శర్మ మంత్రోచ్ఛరణలతో స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తంతో అభిషేకం చేశారు. ఆలయ ప్రాంగనంలో ఆయుష్షు హోమం హారతి, మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ప్రజా సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులే
కోరుట్ల: ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టు పార్టీలేనని సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి అన్నారు. పట్టణంలో గురువారం పార్టీ జిల్లా స్థాయి జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు. ముందుకు పార్టీ జెండాను ఆవిష్కరించి అమరులైన బాల మల్లేశ్, పోటు ప్రసాద్ చిత్రపటాలకు పూలమాల వేశారు. ఈనెల 26న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించి పార్టీ సభ్యత్వాలను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పోటీలో నిలుపుతామన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు చెన్న విశ్వనాథం, సుతారి రాములు, ఎండీ.ముఖ్రం, హనుమంతు, శాంత, భూమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
21వరకు సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలు
జగిత్యాల: చీఫ్ మినిస్టర్ కప్ జిల్లాస్థాయి పోటీలు ఈనెల 21వరకు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు జిల్లాకేంద్రంలోని మినీస్టేడియంలో నిర్వహించనున్నట్లు క్రీడాభివృద్ధి శాఖ అధికారి రవికుమార్ తెలిపారు. 16న వాలీబాల్, చెస్, జూడో, బేస్‌బాల్, 17న కబడ్డీ, బాక్సింగ్, బిలియడ్స్, స్నూకర్, బ్యాడ్మింటన్, 18న ఖోఖో, ఫుట్‌బాల్, 19న అథ్లెటిక్స్, యోగా, కిక్‌బాక్సింగ్, 20న నెట్‌బాల్, సైక్లింగ్, 21న హ్యాండ్‌బాల్, పుష్ రెజ్లింగ్ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.
ఈ–పాస్ యంత్రాల ద్వారానే విక్రయించాలి
మల్లాపూర్: ఈ–పాస్ యంత్రాల ద్వారానే రైతులకు ఎరువులను విక్రయించాలని కోరుట్ల ఏడీఏ దండ రమేశ్ అన్నారు. గురువారం చిట్టాపూర్, సాతారం, వేంపల్లి, సిరిపూర్ గ్రామాల్లో మండల వ్యవసాయ శాఖ అధికారి లావణ్యతో కలిసి ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, స్టాక్ రిజస్టర్, ఈ–పాస్ మిషన్‌ను పరిశీలించారు. రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించొద్దని, సరఫరా చేసినా అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏఈవో గజానంద్ తదితరులు పాల్గొన్నారు.
అనర్హులను తొలగించాలి
జగిత్యాల: కరీంనగర్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు జాబితాలో అనర్హులను తొలగించాలని ఆర్డీవో మధుసూదన్‌కు పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోయినిపల్లి ఆనందరావు, అమర్‌నాథ్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. ప్రైవేటు ఉపాధ్యాయుల ఫాం 19 క్షుణ్ణంగా పరిశీలించి ఓటరు జాబితా నుంచి తొలగించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment