దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
జగిత్యాల: తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ధరణి సమస్యలు వెంటనే పరిష్కరించాలని, భూ సమస్యలున్నా, రిజిస్ట్రేషన్లు సైతం వెంటనే పరిష్కరించాలని సూచించారు. అన్ని రకాల దరఖాస్తులను ఎప్పటికప్పడు పరిష్కరించి జాప్యం లేకుండా సేవలందించాలన్నారు. కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్‌రెడ్డి, శ్రీనివాస్, హన్మంతరావు పాల్గొన్నారు.
నిరుపేదలకు అన్యాయం జరగొద్దు
మెట్‌పల్లిరూరల్: నిరుపేదలకు అన్యాయం జరగకుండా ఇందిరమ్మ ఇళ్ల సర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అన్నారు. మండలంలోని వేంపేటలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలించారు. యాప్‌లో వివరాలు సరిగ్గా నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో మహేశ్వర్‌రెడ్డి, కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శులపై చర్యలు
ఇబ్రహీంపట్నం: ఇందిరమ్మ ఇళ్ల సర్వే పనులు నత్తనడకన కొనసాగితే చర్యలు తప్పవని కలెక్టర్ అన్నారు. మండలంలోని ఎర్దండిలో చేపడుతున్న సర్వేను తనిఖీ చేశారు. మండలంలో 7,941 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటివరకు 9ఇళ్లనే సర్వే చేయడంతో ఎంపీడీవో చంద్రశేఖర్‌ను ప్రశ్నించారు. తహసీల్దార్ ప్రసాద్, హౌసింగ్ డీఈ రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శులు రామకృష్ణ, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment