సాగు నీరందేలా కాలువ నిర్మించాలి
కథలాపూర్:మండలంలోని పోతారం పరిధిలో సాగు భూములకు నీరందేలా సూరమ్మ ప్రాజెక్టు కాలువ నిర్మించాలని కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డికి రైతులు గురువారం వినతిపత్రం ఇచ్చారు. ప్రాజెక్టు కాలువ పనులకు భూసేకరణకు గ్రామసభ నిర్వహించారు. గ్రామశివారులో 24 ఎకరాలు కాలువ పనుల్లో పోతోందని అధికారులు వివరించారు. ప్రస్తుతమున్న కాలువ డిజైన్‌తో భూములకు నీళ్లందవని, గిరిజన తండా పక్కనుంచి కాలువ నిర్మిస్తే నీళ్లందుతాయని రైతులు అభిప్రాయపడ్డారు. తహసీ ల్దార్ వినోద్, డెప్యూటీ తహసీల్దార్ శ్రీనివా స్‌గౌడ్, ఆర్‌ఐ నాగేశ్, నాయకులు పాల్గొన్నారు.
వర్క్‌ఫ్రం హోం పేరుతో సైబర్ మోసం
జగిత్యాలక్రైం: వర్క్ ఫ్రం హోం పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సప్ లింక్ పంపించి బాధితుడికి మాయమాటలు చెప్పి మోసానికి పాల్పడ్డారు. జిల్లాకేంద్రంలోని ఇస్లాంపురకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్‌ఖాన్ సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 21న వాట్సాప్‌లో వర్క్‌ఫ్రం హోం పేరున నెలనెలా వేతనం వస్తుందని మెసేజ్ రావడంతో వాట్సాప్ ద్వారా వారిని సంప్రదించాడు. దీంతో సైబర్ నేరగాళ్లు మహ్మద్ ఇర్ఫాన్‌ఖాన్‌ను నమ్మించి పలుమార్లు వారి ఖాతాల్లోకి సుమారు రూ.2.09 లక్షలు జమ చేసుకున్నారు. లింక్ మూసివేయడంతో బాధితుడు మోసపోయినట్లు తెలుసుకుని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ వేణుగోపాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment