జగిత్యాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే పకడ్బందీగా చేపట్టడం జరుగుతుందని కలెక్టర్‌సత్యప్రసాద్ అన్నారు. ప్రతీ గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల్లో 514 మంది సర్వేయర్లు, పరిశీలనకు మండల ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. అర్జిదారు ఇంటికి వెళ్లి యాప్ ద్వారా ప్రస్తుతం నివసిస్తున్న సొంత లేదా కిరాయి ఇంటి ముందు లబ్ధిదారు ఫొటో తీస్తూ, రేషన్, ఆధార్ కార్డు ప్రజాపాలన దరఖాస్తుల్లో ఎంట్రీ చేసినవి సరిచూసుకోవాలన్నారు. ఈనెల 31 వరకు సర్వే కొనసాగుతుందని పేర్కొన్నారు.
అందుబాటులో మెడికవర్ ఫ్యామిలీ కార్డ్
మెడికవర్ ఆస్పత్రి ప్రవేశపెట్టిన ఫ్యామిలీ కార్డ్‌తో పేషెంట్లకు ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పడంతో పాటు, అందుబాటులో వైద్యం అందుతుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెడికవర్ ఫ్యామిలి కా ర్డ్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. పేషెంట్ ఒకసారి ఫ్యామిలీ కార్డు పొందితే 25 శాతం డాక్టర్ కన్సల్టేష న్‌పై, 15 శాతం రక్తపరీక్షలు, 10 శాతం డే కేర్, క్యాష్ అడ్మిషన్ సేవలపై డిస్కౌంట్ ఉంటుందన్నారు. 30 శాతం హెల్త్‌కేర్ సేవలు, 20 శాతం మందులు, 10 శాతం హెల్త్‌చెకప్స్‌పై రాయితీ ఉంటుందన్నారు. మెడికవర్ హెడ్ గుర్రం కిరణ్, కోట కరుణాకర్, దాసరి చంద్రశేఖర్, సాయితేజ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment