రాజన్న బంగారం!
స్వామివారి వద్ద క్వింటాల్ గోల్డ్.. ఐదు టన్నుల వెండి
● వేములవాడ రాజన్నకు పెరుగుతున్న కానుకలు ● భక్తుల నుంచి ప్రత్యక్ష, హుండీల ద్వారా ఆదాయం ● క్రమంగా పెరుగుతున్న బంగారం, వెండి ఆభరణాలు ● నేతలు, వీఐపీలు, సెలబ్రిటీల రాకతో పెరుగుతున్న రద్దీ ● వచ్చే జనవరి నుంచి వరుస ఉత్సవాలు, వేధిస్తున్న సిబ్బంది కొరత
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇలవేల్పు.. దక్షిణకాశీగా పిలుచుకునే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. క్రమంగా కానుకలు కూడా పెరుగుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్నకు బంగారం, వెండి ముడుపులు గతం కన్నా మెరుగవుతున్నాయి. ఒకప్పుడు రాజకీయ నాయకులు పదవులు పోతా యన్న దుష్ప్రచారాన్ని నమ్మి ఆలయానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. మాజీ సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ, ప్రస్తుత సీఎం రేవంత్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్వామివారిని దర్శించుకుని రెండోసారి జయకేతనం ఎగరవేయడం కలిసి వచ్చింది. కొంతకాలంగా సెలబ్రిటీలు, సినీనటులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మన రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా తరలివస్తున్నారు. రాజన్నకు కోడెలతోపాటు బంగారం, వెండి ఆభరణాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం స్వామివారి వద్ద దాదాపు క్వింటాలు బంగారం, ఐదు టన్నుల వెండి ఉంది. క్రమంగా రవాణా సౌకర్యాల మెరుగు పడుతుండడంతో భక్తులతోపాటు పర్యాటకులు తరలివస్తున్నారు. కొత్తపల్లి– మనోహరాబాద్ రైలుమార్గం పూర్తయితే మూడేళ్లలో రాజన్నకు భక్తుల రద్దీ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.
వేధిస్తున్న సిబ్బంది కొరత
కొంతకాలంగా రాజన్న ఆలయంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏఈవో రమేశ్ బాబును మాతృసంస్థకు డిప్యూటేషన్ మీద పంపారు. సూపరింటెండెంట్ రాజన్‌బాబును డిప్యూటేషన్ కింద యాదగిరి గుట్టకు వెళ్లారు. మరో సూపరింటెండెంట్ శ్రీలతను వేములవాడ నుంచి యాదగిరి గుట్టకు డిప్యూటేషన్ మీద పంపారు. అక్కడ పనిచేస్తున్న వేములవాడ ఉద్యోగి ప్రతాప నవీన్‌కు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పదోన్నతి కల్పించినా వేములవాడకు తిరిగి పంపించడం లేదు. సూపరింటెండెంట్‌గా పదోన్నతులు పొంది కొండగట్టులో పనిచేస్తున్న ఉపాధ్యాయుల చంద్రశేఖర్, ఎర్రం భూపతిరెడ్డిని వేములవాడకు పంపించాల్సి ఉన్నా జాప్యం చేస్తున్నారు. ఒక డీఈవో, ఏఈవో, మరో నలుగురు సూపరింటెండెంట్లు వేములవాడకు రాకపోవడం వల్ల పని ఒత్తిడి అంతా మిగిలిన వారిమీద పడి పరిపాలన ఒత్తిడి పెరిగి భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని ఆలయ సిబ్బంది, భక్తులు భావిస్తున్నారు. జనవరి నుంచి జాతరలు, కల్యాణాలు జరగనున్న నేపథ్యంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అయినా దేవాదాయశాఖ నిర్లక్ష్యం వహించడంతో ఉద్యోగుల కొరత అలాగే వేధిస్తోంది. వెంటనే ఆయా ఉద్యోగుల భర్తీ చేపట్టాలని సిబ్బంది, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
బంగారు
ఆభరణాలు
మిక్స్‌డ్
బంగారం
బంగారు
కడ్డీలు
మిక్స్‌డ్ 2,583.919 కిలోలు
హుండీ ద్వారా వచ్చింది 128.684 కిలోలు
వెండి కడ్డీలు 486 కిలోలు
(నోట్: 30–04–2024 నుంచి ఇప్పటి వరకు 100కిలోల బంగారం, 5,000 కిలోల వెండి స్వామివారికి వచ్చినట్లు సమాచారం)
రాజన్న ఆలయం ఆవరణలో స్వామివారి
హుండీ లెక్కిస్తున్న సిబ్బంది (ఫైల్)
వెండి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment