క్షీరాభిషేకం, ప్రత్యేకాలంకరణ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం చేసి పూలతో అలంకరించారు. అర్చకుడు శ్రీనివాసచార్యులు మంత్రోచ్ఛరణలతో ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారలను దర్శించుకున్నారు.
నేడు జాతీయ లోక్ అదాలత్
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురిలోని కోర్టుల్లో శని వారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నా రు. లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోదగిన కేసులను సత్వరం పరిష్కరిస్తారు. భూ తగదా లకు చెందిన సివిల్, క్రిమినల్, మోటార్ వాహనాల కేసులు, ప్రామిసరీ నోట్లు, చెక్ బౌన్స్, బ్యాంకుల లావాదేవిలు, మహిళలకు సంబంధించిన కేసులు పరిష్కరిస్తారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ జి.నీలిమ, కార్యదర్శి కంచ ప్రసాద్ పేర్కొన్నారు. కాగా జిల్లా కోర్టులో ఐదు లోక్ అదాలత్ బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
లక్ష్మీనృసింహుని సేవలో జడ్జి
సారంగాపూర్(జగిత్యాల): బీర్‌పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శుక్రవారం ధర్మపురి కోర్టు జడ్జి పి.శ్యాంసుందర్ కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికి, స్వామివారి తీర్థప్రసాదం అందించారు.
జీపీ కార్మికుల సమ్మె నోటీస్
జగిత్యాలటౌన్: గ్రామపంచాయతీ కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈనెల 20 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు సీఐటీయూ జీపీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కోమటి చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 20వ తేదీలోపు రాష్ట్ర జేఏసీ నాయకత్వంతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని లేకుంటే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. జీపీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి పులి మల్లేశం, ప్రతినిధులు వంగ రాజేశం, సాతల్ల రాజేందర్, జంగిలి ఎల్లయ్య, మహేశ్, రాజయ్య, పోతుగంటి లచ్చన్న పాల్గొన్నారు.
ఎస్సైల బదిలీ
జగిత్యాలక్రైం: జిల్లాలో ముగ్గురు ఎస్సైలను బదిలీ చేస్తూ శుక్రవారం ఎస్పీ అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మల్లాపూర్ ఎస్సైగా పనిచేస్తున్న కిరణ్‌కుమార్‌ను మెట్‌పల్లి– 1 ఎస్సైగా, మెట్‌పల్లి– 2 ఎస్సై అటాచ్‌గా పనిచేస్తున్న కె.రాజు మల్లాపూర్‌కు, ఆదిలాబాద్ వీఆర్‌లో ఉన్న మహేశ్ జగిత్యా డీఎస్పీ ఎస్సైగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రహదారిని విస్తరించాలి
జగిత్యాలరూరల్: లింగంపేట రైల్వేస్టేషన్‌కు వెళ్లే రహదారిని విస్తరించాలని అంబారిపేట, హస్నాబాద్ గ్రామాల రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణ శివారులోని స్వప్న దాబా వద్ద జగిత్యాల–నిజామాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, లింగంపేట స్టేషన్‌కు వెళ్లే దారి సింగిల్‌గా ఉండి లారీల రాకపోకలు పెరగడంతో అంబారిపేట, హస్నాబాద్ గ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. పట్టణ ఎస్సై కిరణ్ ఘటన స్థలానికి చేరుకుని రైతులు, గ్రామస్తులతో మాట్లాడారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని రాస్తారోకో విరమింపజేశారు.
ఒకేరోజు 50 కు.ని. ఆపరేషన్లు
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 50 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసినట్లు డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ తెలిపారు. సర్జన్ యాకూబ్‌పాషా, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment