పకడ్బందీగా గ్రూప్–2 పరీక్షలు
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల: నిబంధనల ప్రకారం గ్రూప్–2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అ న్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అబ్జర్వర్స్, డిపార్ట్‌మెంటల్ అధికారులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. టీజీపీఎస్సీ ఆదేశాలతో జిల్లాలో 15, 16వ తేదీల్లో ఉదయం 10 నుంచి12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 10,907 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు వివరించారు. జిల్లాలో 35 కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొబైల్‌ఫోన్లకు అనుమతి లేదన్నారు. 35 మంది చీఫ్ డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్స్, 35 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, అబ్జర్వర్స్ 35 మంది ఉన్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9.30 గంటల లోపు కేంద్రాలకు చేరుకోవాలని, గుర్తింపు కార్డులు మినహా ఏమీ వెంట తీసుకురావద్దన్నారు. అదనపు కలెక్టర్ గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పటిష్ట బందోబస్తు
జగిత్యాలక్రైం: గ్రూప్–2 పరీక్షకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్‌కుమార్ తె లిపారు. జగిత్యాల టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల ప రిధిలో 23, కోరుట్ల ఠాణా పరిధిలో 7, మల్యాల పరిఽ దిలో 2, కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేంద్రాలున్నాయన్నారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా 9 మంది సీఐలు, 21 మంది ఎస్సైలు, 170 మంది ఏఎస్సై/హెచ్‌సీ/పీసీ/హోంగార్డ్‌లు బందోబస్త్‌లో పాల్గొంటారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment