సీపీఆర్‌పై అవగాహన ఉండాలి
● ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాల: సీపీఆర్ (హృదయ శ్వాసకోశ పునర్జీవన చర్య)పై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలని, గుండెపోటు మరణాలను నియంత్రించే అవకాశం ఉంటుందని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. శుక్రవారం పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారులకు సీపీఆర్‌పై ఐఎంఏ సిబ్బంది అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ పాల్గొని మాట్లాడారు. సీపీఆర్‌పై పోలీసులు అవగాహన పొందితే గుండెపోటు వచ్చిన వ్యక్తులను కాపాడవచ్చన్నారు. సీపీఆర్ చేసే కాలాన్ని గోల్డోన్ అవర్‌గా భావించడం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా బ్లూకోల్ట్స్, ట్రాఫిక్ విధులు, పెట్రోకార్ నిర్వహిస్తున్న సిబ్బందికి ఐఎంఏ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అలాగే క్షేత్రస్థాయిలో ఉండే ఆటోడ్రైవర్లు, పెట్రోల్‌బంక్‌ల్లో పనిచేసే వారికి దీనిపై అవగాహన కల్పిస్తే ప్రమాదాలు నియంత్రణలోకి తీసుకురావచ్చన్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ హేమంత్, సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సునీల్, హిమబిందు, స్రవంతి, డీఎస్పీ రఘుచందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment