ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేటకు చెందిన ఓ కుల సంఘం సభ్యులు తీసుకున్న నిర్ణయం వివాదా స్పదంగా మారింది. మండల కేంద్రానికి చెందిన దేవయ్య, శ్రీకాంత్ తండ్రీకొడుకులు. శ్రీకాంత్ ఓ రాజకీయపార్టీలో చురుకుగా ఉండడంతోపాటు గ్రా మంలో శ్రీవేణుగోపాలస్వామి ఆలయ కమిటీలో సభ్యుడిగా ఉంటున్నాడు. తన కులంలోని కొందరికి శ్రీవేణుగోపాలస్వామి ఆలయ కమిటీకి పొరపచ్చాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి సదరు వ్యక్తులు శ్రీకాంత్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఈనెల 10న జరిగిన సమావేశంలో శ్రీకాంత్‌తో ఎవరూ మాట్లాడొద్దని తీర్మానించినట్లు తెలిసింది. ఈ నిర్ణయం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఎస్పీ అఖిల్‌మహాజన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు శ్రీకాంత్ తెలిపాడు.
ద్విచక్రవాహనం చోరీ
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి బస్టాండ్‌లో శుక్రవారం ద్విచక్రవాహనం చోరీకి గురైంది. బాధితుడు తెలిపిన వివరాలు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన అజయ్‌కుమార్ ఎల్లారెడ్డిపేట మండలంలో మేసీ్త్ర పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. గొల్లపల్లిలోని అంబేడ్కర్ వద్ద బైక్‌ను ఆపి, ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నాడు. అయితే అతని పల్సర్ వాహనం చోరీకి గురైంది. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment