ప్రతీ సదస్సుకు హాజరవుతా
పొలాస పరిశోధన స్థానంలో జరిగే ప్రతీ సదస్సుకు నేను హాజరవుతా. ఇక్కడ శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు ఆకళింపు చేసుకొని, నా పొలంలో ప్రయోగాలు చేస్తుంటాను. వ్యవసాయంలో విజయం సాధించానన్న తృప్తి ఉంది.
– రూపిరెడ్డి లక్ష్మి, మానకొండూర్
40 ఏళ్ల అనుబంధం
పొలాస శాస్త్రవేత్తలతో నాది 40 ఏళ్ల అనుబంధం. ఒకసారి వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా బోర్డు సభ్యుడిగా పని చేశాను. ప్రతీ కార్యక్రమానికి హాజరై, నా సందేహాలను నివృత్తి చేసుకుంటా. నాకు తెలిసినవి చెబుతుంటా.
– వెల్ముల రాంరెడ్డి, పూడూరు, కొడిమ్యాల
పరిశోధనలపై దృష్టి పెడతాం
శాస్త్రవేత్తల పరిశోధనలపై మా ఆయన, నేను దృష్టి పెడతాం. అధిక దిగుబడినిచ్చే విత్తనాలను పరిశోధన స్థానం నుంచి తీసుకెళ్లి, మా పొలంలో వేసుకుంటాం. అధిక దిగుబడికి శాస్త్రవేత్తల సలహాలు ఉపయోగపడుతున్నాయి.
– వంగల పద్మ, సిర్సపల్లి, హుజూరాబాద్
Comments
Please login to add a commentAdd a comment