పాలకుర్తి(రామగుండం): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బసంత్‌నగర్ ఎస్సై స్వామి వివరాల ప్రకారం.. గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి అనసూరి లక్ష్మీరాజం(62), భార్య వీరలక్ష్మి, కుమారుడు సతీశ్ హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి కారులో వెళ్లారు. శుక్రవారం తిరిగి వస్తుండగా పాలకుర్తి మండలంలోని బసంత్‌నగర్ బస్టాండ్ దాటాక కారు అదుపుతప్పి, కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో హెచ్‌కేఆర్ అంబులెన్స్‌లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మీరాజం మృతిచెందాడు. ఎస్సై స్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్రేన్ సహాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును తొలగించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇద్దరికి తీవ్ర గాయాలు
కల్వర్టును కారు ఢీకొట్టడంతో ఘటన
Comments
Please login to add a commentAdd a comment