ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని..
● యువతి బలవన్మరణం
రాయికల్(జగిత్యాల): ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని రాయికల్ మండలం ధర్మాజీపేటకు చెందిన భూక్య మల్లీశ్వరి ఆత్మహత్య చేసుకుందని ఎస్సై సుధీర్‌రావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మల్లీశ్వరికి మంక్త్యానాయక్ తండాకు చెందిన ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. అయితే, ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆమె మనస్తాపానికి గురైంది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. మృతురాలి తల్లి కళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment