శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని మెట్‌పల్లికి చెందిన క్యాదాసి సంపత్ అదృశ్యమైనట్లు కేశవపట్నం పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. సంపత్ గత నెల 17న బైక్‌పై ఇంటి నుంచి వె ళ్లి, తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు బంధువుల ఇళ్లలో, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అతని భార్య స్రవంతి శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
లీజు టెండర్ ఉపసంహరించుకోవాలి
కరీంనగర్: నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో గల ఇండోర్ బ్యాడ్మింటన్, స్కేటింగ్ కోర్టుల లీజు టెండర్‌ను ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కోర్టుల టెండర్ ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే నిరుపేద క్రీడాకారులు ఆటలకు దూరమవుతారని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. లేకపోతే క్రీడాకారులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment