రేపటి నుంచి సీఎం కప్ పోటీలు
● ఈ నెల 21 వరకు క్రీడా సందడి
● ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పూర్తయిన ఏర్పాట్లు
కరీంనగర్ స్పోర్ట్స్: సీఎం కప్–2024 కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా స్థాయి పోటీల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 15వ తేదీ నుంచి 21 వరకు ఆయా జిల్లా కేంద్రాల్లో అట్టహాసంగా నిర్వహించేందుకు క్రీడాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాస్థాయి పోటీలకు సంబంధించిన షెడ్యూల్‌ను డీవైఎస్‌వోలు ఖరారు చేశారు. జిల్లా జట్లను ఎంపిక చేసి, రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నారు. ఈ నెల 18 నుంచి 21 వరకు రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలు జరగనున్నాయి. 27 నుంచి జనవరి 2వ తేదీ వరకు వివిధ క్రీడాంశాల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు.
కరీంనగర్ జిల్లాస్థాయి పోటీలు..
● 15న కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో బేస్‌బాల్ పోటీలు.
● 16న అథ్లెటిక్స్, జూడో (ప్రాంతీయ క్రీడా పాఠశాలలో), ఆర్చరీ, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ (అంబేడ్కర్ స్టేడియంలో).
● 17న రెజ్లింగ్(ప్రాంతీయ క్రీడా పాఠశాలలో), బ్యాడ్మింటన్ (అంబేడ్కర్ స్టేడియం ఇండోర్ హాల్‌లో), బాక్సింగ్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, యోగా(అంబేడ్కర్ స్టేడియంలో), వుషు (ఫండస్ పాఠశాలలో).
● 18న టేబుల్‌టెన్నిస్(జీఎస్ అకాడమీ), వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్ (ప్రాంతీయ క్రీడా పాఠశాలలో), హాకీ, నెట్‌బాల్, అత్యాపత్యా, పవర్ లిఫ్టింగ్, సాఫ్ట్‌బాల్(అంబేడ్కర్ స్టేడియంలో), చెస్ (జీనియస్ చెస్ అకాడమీ), సెపక్ తక్రా, కరాటే, కిక్ బాక్సింగ్ (అంబేడ్కర్ స్టేడియం ఇండోర్ హాల్‌లో), సైక్లింగ్ (శాతవాహన వర్సిటీ).
● 19న తైక్వాండో (అంబేడ్కర్ స్టేడియం ఇండోర్ హాల్‌లో).
జగిత్యాల జిల్లాలో..
● 16న జగిత్యాల స్వామి వివేకానంద మినీ స్టేడియంలో వాలీబాల్, చెస్, జూడో, బేస్‌బాల్ పోటీలు.
● 17న కబడ్డీ, బాక్సింగ్, బిలియర్డ్స్ స్నూకర్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ (జగిత్యాల క్లబ్).
● 18న ఖోఖో, ఫుట్‌బాల్ (స్వామి వివేకానంద మినీ స్టేడియం).
● 19న అథ్లెటిక్స్, యోగా, కిక్‌బాక్సింగ్ (స్వామి వివేకానంద మినీ స్టేడియం).
● 20న నెట్‌బాల్, సైక్లింగ్, బాస్కెట్‌బాల్ (స్వామి వివేకానంద మినీ స్టేడియం).
● 21న హ్యాండ్‌బాల్, వుషు, రెజ్లింగ్ (స్వామి వివేకానంద మినీ స్టేడియం).
● 16 నుంచి 21 వరకు క్రికెట్ (ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాలలో, గీతా విద్యాలయంలో).
రాజన్న సిరిసిల్లలో..
● 18న సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు.
● 19న హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, బేస్‌బాల్, నెట్‌బాల్ (రైసింగ్ ఫిట్‌నెస్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ సిరిసిల్లలో).
● 20న అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, యోగా, చెస్, కిక్ బాక్సింగ్, వుషు, జూడో, టీటీ, క్యారమ్స్, తైక్వాండో, కరాటే, పవర్ లిఫ్టింగ్ (సిరిసిల్ల మినీ స్టేడియం).
పెద్దపల్లి జిల్లాలో..
● 16న బ్యాడ్మింటన్, యోగా (ఎఫ్‌సీఎం, మంథని), టీటీ (ఇండియన్ పబ్లిక్ స్కూల్, సుల్తానాబాద్).
● 19న జూడో, రెజ్లింగ్ (ఇండియన్ పబ్లిక్ స్కూల్, సుల్తానాబాద్) ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ (బాలికలు, మహిళలకు, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం సుల్తానాబాద్).
● 20న హాకీ (యైటింక్లయిన్ కాలనీ), అథ్లెటిక్స్ (బాలబాలికలు, పురుషులు, మహిళలకు, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, సుల్తానాబాద్)
● 21న ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ (బాలురు, పురుషులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, సుల్తానాబాద్).
● 16 నుంచి 21 వరకు హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, చెస్, కరాటే, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించనున్నారు.
సమయానికి తీసుకురావాలి
జిల్లా స్థాయి పోటీలను ఘనంగా నిర్వహిస్తాం. అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు హాజరుకానున్నారు. ఆయా మండలాల ఇన్‌చార్జీలు జట్లను నిర్ణీత సమయానికి తీసుకురావాలి.
– కె.రవికుమార్, డీవైఎస్‌వో, జగిత్యాల
Comments
Please login to add a commentAdd a comment