యువకుడి ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై గణేశ్ వివరాల ప్రకారం.. ము స్తాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన కంచం సురేశ్(28) ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి, రెండేళ్ల క్రితమే వచ్చాడు. సిరిసిల్లలో ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. అతని తల్లి పదేళ్ల క్రితం అనారో గ్యంతో మృతిచెందగా, సోదరుడు నరేశ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో సురేశ్ మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకున్నాడు. శుక్రవారం ఉదయం కుమారుడు ఉరితాడుకు వేలాడుతూ కనిపించడంతో తండ్రి నర్సయ్య కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
వేములవాడలో వివాహిత..
వేములవాడ: పట్టణానికి చెందిన సోమినేని మౌనిక(30) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మౌనిక కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. కడుపునొప్పి భరించలేక శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుందని ఆమె తండ్రి తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
వీరాపూర్‌లో వృద్ధుడు..
రాయికల్(జగిత్యాల): రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామానికి చెందిన ఇప్ప రాజలింగం(63) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధీర్‌రావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. రాజలింగం భూమికి సంబంధించి దారి సమస్య ఏళ్లుగా పరిష్కారం కావడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన శుక్రవారం క్రిమిసంహారక మందు తాగాడు. స్థానికులు జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య కనకవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి మరొకరు..
కరీంనగర్ క్రైం: జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. నగరంలోని కట్టరాంపూర్‌కు చెందిన కుంకుమల్ల శ్రీరాములు(78) కుటుంబసభ్యులతో కలిసి స్థానిక ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. ఐదేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఎంతకూ నయం కాకపోవడంతో చనిపోతానని కుటుంబసభ్యులతో అంటుండేవాడు. శుక్రవారం లిఫ్ట్‌లో ఐదో అంతస్తుకు వెళ్లి, దూకాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలవడంతో శ్రీరాములు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య జయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
కరీంనగర్ క్రైం: కరీంనగర్ మార్కెట్ ఏరియాలోని కేడీసీసీ బ్యాంకు సమీపంలో శుక్రవారం గుర్తు తె లియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. ఎవరి సంబంధీకులైనా కనిపి ంచకపోతే తమను ఆశ్రయించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment