ఎములాడకు పోటెత్తిన భక్తులు
వేములవాడ: ఎములాడ రాజన్నను శుక్రవారం 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.30 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికా రులు తెలిపారు. ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణాలు, సత్యనారా యణ వ్రతాలు జరిగాయి. భక్తుల ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.
జనవరి 18 నుంచి
త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు
వేములవాడ రాజన్న సన్నిధిలో వచ్చే నెల 18 నుంచి 22వ తేదీ వరకు జగద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తామని ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈసారి కళాకారులకు ప్రత్యేక నిబంధనలు విధించామన్నారు. వాటి ప్రకారం నడుచుకోవాలని, వివరాల కోసం ఆలయ పని వేళల్లో సంప్రదించాలని సూచించారు. భక్తుల పూజలు, మొక్కులు తదితర వివరాలతో కూడిన బ్రోచర్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment