యూట్యూబ్ చానల్‌పై ఎస్పీకి ఫిర్యాదు
జగిత్యాల క్రైం: తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. యూట్యూబ్ చానల్‌లో ప్రచారం చేశారని జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన నర్ర రమేశ్ ఆరోపించాడు. శుక్రవారం సదరు చానల్ యాజమాన్యంపై ఎస్పీ అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేశానని తెలిపాడు. తనకు మోతె గ్రామానికే చెందిన వారితో భూ వివాదం ఉందని, ఈ విషయమై వారం రోజుల క్రితం గొడవ పడ్డామని పేర్కొన్నాడు. అయితే, వాస్తవాలు తెలుసుకోకుండా యూట్యూబ్ చానల్‌లో ఏకపక్షంగా తప్పుడు వార్తలు ప్రచారం చేశారన్నాడు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరానని తెలిపాడు.
గుండెపోటుతో ఒకరి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన పెద్దూరి మల్లయ్య(62) గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మల్లయ్య కుల వృత్తి(రజక) చేసుకుంటూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తన షాపులో దుస్తులు ఇసీ్త్ర చేస్తుండగా గుండెపోటు వచ్చింది. స్థానికులు మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
జమ్మికుంటలో యువకుడి వీరంగం
● నగ్నంగా తిరుగుతూ మహిళా ప్రయాణికులతో అసభ్య ప్రవర్తన
● దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగింత
జమ్మికుంట(హుజూరాబాద్): ఓ యువకుడు నగ్నంగా తిరుగుతూ వీరంగం సృష్టించాడు. స్థానికులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జమ్మికుంట పట్టణ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన భోగి అఖిల్ శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చాడు. రాత్రి బస్టాండ్‌లో నగ్నంగా తిరుగుతూ మహిళా ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అక్కడున్నవారు అతన్ని పట్టుకొని, దేహశుద్ధి చేశారు. అనంతరం టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ రవి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అఖిల్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి, విచారణ చేపట్టారు. తర్వాత అతని బంధువులను పిలిపించి, అప్పగించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment