22 వరకు ‘ట్రినిటీ’ ఒలింపియాడ్ టెస్ట్
కరీంనగర్: గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా కరీంనగర్, పెద్దపల్లి ట్రినిటీ జూనియర్ కళాశాలల ఆధ్వర్యంలో ఒలింపియాడ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు కళాశాలల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఎస్సెస్సీ విద్యార్థులకు ఈ నెల 18వ తేదీ వరకు ఒలింపియాడ్ లెవెల్–1 పరీక్షను వారివారి స్కూల్స్‌లోనే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్‌లోని కళాశాల ఆవరణలో సంబంధిత పోస్టర్ ఆవిష్కరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ నెల 22న రామానుజన్ జయంతి సందర్భంగా లెవెల్–2 పరీక్ష కరీంనగర్ పట్టణంలోని ట్రినిటీ ప్రైమ్ క్యాంపస్, ఏసీ బాయ్స్ క్యాంపస్, ఏసీ గర్ల్స్ క్యాంపస్‌లలో జరుపుతామని తెలిపారు. ఇక్కడ సత్తా చాటినవారికి 25న ట్రినిటీ ప్రైమ్ క్యాంపస్‌లో బహుమతి ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. మొదటి బహుమతి రూ.10,000, రెండో బహుమతి రూ.7,500, మూడో బహుమతి రూ.5 వేలు, నాలుగో బహుమతి రూ.3 వేలు, ఐదో బహుమతి రూ.2 వేలు, 6 నుంచి 10 ర్యాంకులు వరకు రూ.1,500, 20 మంది విద్యార్థులకు రూ.1,000 చొప్పున ఇవ్వడంతోపాటు మెడల్స్, మెమొంటోలు, ప్రశంసాపత్రాలు ఇస్తామన్నారు. లెవెల్–2 పరీక్షలో 80 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు తమ కళాశాలలో 10 నుంచి 100 శాతం వరకు ఫీజు రాయితీ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment