మెనూ ప్రకారం భోజనం అందించాలి
జగిత్యాల: విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా హాస్టళ్లలో కామన్‌డైట్ శనివారం నుంచి ప్రారంభమైందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ పాఠశాల, పలు స్కూళ్లలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచడం జరిగిందని, రోజూ మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. డైట్ చార్జీలు 3–7వ తరగతి విద్యార్థులకు రూ.950 – రూ.1,330, 8–10వ తరగతి విద్యార్థులకు రూ. 1,100– రూ.1,540, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు రూ.1,500– రూ.2,100 ప్రభుత్వం పెంచిందన్నారు. అలాగే కాస్మోటిక్ చార్జీలు బాలికలకు 7వ తరగతి వరకు రూ.55–రూ.175, 11 ఏళ్ల వయస్సు గల బాలికలకు రూ.75– రూ.275 పెంచడం జరి గిందన్నారు. 7వ తరగతి బాలురకు రూ.62– రూ. 150, 11 ఏళ్ల బాలురకు రూ.62– రూ.200 పెంచడం జరిగిందన్నారు. ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్‌కుమార్, మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
నాణ్యత లోపించొద్దు
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల)/కొండగట్టు(చొప్పదండి): విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన ఆహారం అందిస్తోందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురకుల పాఠశాలలో శనివారం కామన్ డైట్ మెనూ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆహారంలో నాణ్యత లోపించొద్దని సూచించారు. ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజు, ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు. అలాగే మల్యాల మండలం తాటిపల్లి గురుకుల పాఠశాలలో కొత్త మెనూను కలెక్టర్ సత్యప్రసాద్ ప్రారంభించారు. తహసీల్దార్ మునీందర్, ప్రిన్సిపాల్ మానస తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment