పెరిగిన చార్జీలకు అనుగుణంగా భోజనం పెట్టాలి
ధర్మపురి: గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. రాష్ట్రప్రభుత్వం డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడంపై హర్షిస్తూ శనివారం ధర్మపురిలోని జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాల, మగ్గిడి గురుకుల పాఠశాలలో మెనూ ప్రారంభించి మాట్లాడారు. పెరిగిన చార్జీలకు అనుగుణంగా ఆహారం అందించాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. గత ప్రభుత్వం విద్యార్థుల భోజన విషయం పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని జైనాలో పెట్రోల్ బంకును డీసీఎమ్మెస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించా రు. ఏఎంసీ చైర్మన్ చిలుముల లావణ్య, వైస్ చైర్మన్ నర్సింహులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): విద్యతోనే ప్రతీ ఒక్కరికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. శనివారం మెట్‌పల్లి మండలం మేడిపల్లి శివారులోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి కామన్ డైట్ మెనూ ప్రారంభించారు. తరగతి, వసతి గదులు, కిచెన్‌ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. శుభ్రత, నిర్వహణ విషయంలో సంతృప్తి వ్యక్తం చేసి, పాఠశాల బృందాన్ని అభినందించారు. డీఎస్పీ రాములు, సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సై అనిల్, మున్సిపల్ కమిషనర్ మోహన్, ప్రిన్సిపాల్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment