35 కేంద్రాలు.. 10,907 మంది అభ్యర్థులు
● నేటి నుంచి గ్రూప్–2 పరీక్షలు ● సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం
జగిత్యాల: జిల్లాలో ఈనెల 15,16 తేదీల్లో నిర్వహించే గ్రూప్–2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షల్లో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా రోజుకు రెండు పేపర్ల చొప్పున పరీక్షలు జరుగనున్నాయి. ఉద యం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప రీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులు ఇయర్‌ప్యాడ్స్, సెల్‌ఫోన్లు, వాచ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఎలక్ట్రానిక్‌కు సంబంధించిన వస్తువులు తీసుకెళ్లొద్దు.
పటిష్ట భద్రత
జిల్లా వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో జరిగే గ్రూ ప్–2 పరీక్షలకు 10,907 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 35 కేంద్రాలను ఏర్పాటు చేయగా, చీఫ్ డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్స్ 35, చీఫ్ సూపరింటెండెంట్స్ 35, అబ్జర్వర్స్ 35 మందిని ఏర్పాటు చేశారు. జగిత్యాల టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 23, కోరుట్ల పరిధిలో 7, మల్యాల 2, కొడిమ్యాల పరిధిలో 3 కేంద్రాలున్నాయి. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. 9 మంది సీఐలు, 21 ఎస్సైలు, 170 మంది ఏఎస్సై, హెచ్‌సీ, పీసీ, హోంగార్డ్‌లు బందోబస్త్‌లో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment