మెస్‌చార్జీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రిదే
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాలరూరల్: రాష్ట్రంలో వసతి గృహాల విద్యార్థులకు 40 శాతం మెస్‌చార్జీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిదేనని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కొత్త డైట్ మెనూ ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేయగా చల్‌గల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు మెమోంటోలు అందజేసి, విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. జిల్లా బీసీ సంక్షేమాధికారి నరేశ్, ప్రిన్సిపాల్ చైతన్య, నాయకులు చెరుకు జాన్, గంగన్న, ఇంద్రయ్య, నక్కల రవీందర్‌రెడ్డి, రాజిరెడ్డి, సత్తిరెడ్డి, చంద్రారెడ్డి, సుధాకర్, బాపరెడ్డి, ప్రభాత్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment