No Headline
ఉరుకులు పరుగుల జీవితం.. తీరిక లేని జీవ నం మనుషుల అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. కాస్త నడిస్తే ఆయాసం, కొంచెంఎక్కువ తింటే మధుమేహం, రక్తపోటు, థైరా యిడ్ చిన్న వయసులోనే బాధ పెడుతున్నాయి. దీనంతటికీ కారణం కల్తీ. నూనెలు మొదలు తినే ప్రతీ ఆహార పదార్థం కల్తీమయం అవుతోంది. దీంతో కొద్దికాలంగా మనుషుల ఆలోచన తమ ఆరోగ్యం వైపు మళ్లుతోంది. ఎలాంటి రసాయనాలు లేని నాటికాలపు ఆహారం తీసుకునేందుకు మక్కువ చూపుతు న్నారు. కొందరు ఇళ్లలోనే తయారు చేసుకుంటుంటే.. మరికొందరు బయట కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల ప్రజల అలవాట్లను పలువురు వ్యాపారంగా మలుచుకుని ఎద్దుల సాయంతో గానుగ ఆడించి నువ్వులు, పల్లీలు, పొద్దుతిరుగుడు, కుసుమ నూనె తయారు చేస్తున్నారు. హెల్తీ జ్యూస్, అంబలి, చిరుధాన్యాల రూపంలో సేంద్రియ ఆహారం అందిస్తూ.. ఆరోగ్యాన్ని పంచుతున్నారు. వారూ ఆదాయంగడిస్తు న్నారు. అలాంటివారిలో కొందరిపై సండే స్పెషల్..!!
Comments
Please login to add a commentAdd a comment