జనగామ రూరల్: దివ్యాంగులు ఆత్మన్యూనతా భావాన్ని విడనాడాలి.. పాజిటివ్ దృక్పథంతో సమాజంలో ముందడుగు వేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రం ధర్మకంచలోని మినీ స్టేడియంలో జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన క్రీడాపోటీలను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం రన్నింగ్, షార్ట్‌పుట్, క్యారమ్స్, చెస్, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను వీక్షించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, యువజన క్రీడల అధికారులు ఫ్లోరెన్స్, వెంకట్‌రెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు చేయాలి
పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శుక్రవారం ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, వెల్ఫేర్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో నిర్వహించిన గూగుల్ మీట్‌లో మాట్లాడారు. విద్యార్థులకు అందించే మధ్యహ్న భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎంఈఓలు హెచ్‌ఎంలు పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.
డాటా ఎంట్రీలో తప్పులుండొద్దు
రఘనాథపల్లి: సమగ్ర ఇంటింటి సర్వే వివరాలు ఆన్‌లైన్ డాటా ఎంట్రీలో తప్పులు లేకుండా చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శుక్రవారం స్థానిక సెయింట్ ఆల్ఫోన్స్ హైస్కూల్‌లో సర్వే డాటా ఎంట్రీ కేంద్రాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. ఆపరేటర్లకు సూచనలు చేశారు. తహసీల్దార్ మోిహిన్ ముజ్తబ, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంపీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలాగే క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల, చిల్పూర్ విద్యా వనరుల కేంద్రంలోని ఆన్‌లైన్ డాటా ఎంట్రీ సెంటర్లను అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ పరిశీలించారు.
నర్సింగ్ కళాశాల పనుల్లో వేగం పెంచండి..
జనగామ: జిల్లా కేంద్రం ధర్మకంచ, ఎస్సీ బాలికల వసతి గృహం పైఅంతస్తులో కేటాయించిన నర్సింగ్ కళాశాల మరమ్మతు పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లో పనులు పూర్తి కావాలని, భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చేపట్టాలన్నారు. తరగతి గదుల్లో కుర్చీలు, ఫర్నిచర్‌తోపాటు కనీస మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధ, మున్సిపల్ డీఈ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment