లంబాడ జాతి అభివృద్ధికి కృషి
భూపాలపల్లి రూరల్ : లంబాడ జాతి అభివృద్ధికి కృషి చేయాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోత్ రాంబాబు నాయక్ అన్నారు. సేవాలాల్ సేన ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఏక్ సాత్ ఏక్ వాత్ ప్రజా రగ్ జోల్ యాత్ర బుధవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు భూక్య సురేష్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లాలోని గిరిజనులంతా యాత్రకు మంజూర్‌నగర్‌లో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాంబాబు నాయక్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజారగ్ జోల్ యాత్ర మహబూబాద్, ఖమ్మం, వరంగల్, ములుగు మీదుగా బుధవారం నాటికి 11వ రోజు భూపాలపల్లికి చేరుకుందన్నారు. తెలంగాణలో అగ్రకుల నాయకులు అధికారాన్ని చెలాయిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఓటు బ్యాంకుగా గుర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఉద్యోగాల ఊసే లేదని, సేవాలాల్ సేన 27 డిమాండ్లతో యాత్ర చేస్తుందని, తక్షణమే డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. సేవాలాల్ సేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ సంతోష్ నా యక్, మ హిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శారదా బాయి, జిల్లా ప్రధాన కార్యదర్శులు వాలునాయక్, రామస్వామి నరేష్ నాయక్, సేవాలాల్ సేన నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు
ఆంగోత్ రాంబాబు నాయక్
Comments
Please login to add a commentAdd a comment