పాడితో అదనపు ఆదాయం
కాళేశ్వరం: రైతులు పశు సంపదతో అదనపు ఆదాయం పొందవచ్చని, వ్యవసాయంతో పాటు పాడి పశువులను పెంచాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సూపర్‌వైజర్ రాఘవ, మహదేవపూర్ అసిస్టెంట్ సర్జన్ బుర్ర రాజబాపులు అన్నారు. ఽబుధవారం మహదేవపూర్ మండలం బెగ్లూర్ గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం, కృత్రిమ గర్భాధారణ ద్వారా జన్మించిన దూడల ప్రదర్శన నిర్వహించారు. నట్టల నివారణ మందులు తాగించారు. రైతులకు కృత్రిమ గర్భధారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడి రైతులకు కృత్రిమ గర్భధారణతో మేలు జాతి ఆడదూడలు జన్మిస్తాయన్నారు. పాల దిగుబడి పెంపుకు పాడి రైతులు నిత్యం పాడి పశువులకు సరైన పోషణ, పోషకాహారం, బలమైన ఆహారం తయారు చేసి అందించాలని పేర్కొన్నా రు. ఈ శిబిరంలో 5 ఆవులు, 27 గేదెలు మొత్తం 32 పశువులకు గర్భకోశ పరీక్షలు నిర్వహించి వాటికి తగిన మందులు అందించారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్రలు రాజబాబు, ముదాషిర్, బానయ్య, పోషాలు, కిషన్‌రావు, నాగరాజు, పశుసంవర్ధక సిబ్బంది లక్ష్మణ్, పాడి రైతులు పాల్గొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పశుగణాభివృద్ధి
సంస్థ సూపర్‌వైజర్ రాఘవ
Comments
Please login to add a commentAdd a comment