మహిళాశక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ | - | Sakshi
Sakshi News home page

మహిళాశక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ

Published Fri, Sep 27 2024 2:42 AM | Last Updated on Fri, Sep 27 2024 2:42 AM

మహిళాశక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ

గద్వాల: తెలంగాణ సాయుధపోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర విశేషమైనదని మహిళా చైతన్యం, శక్తికి ప్రతీక అని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కుల కోసం భూస్వాముల అక్రమార్కులకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారిమణి ఐలమ్మ అన్నారు. నేటితరానికి ఆమె చూపిన మార్గం ఆదర్శనీయమని అందరూ కూడా ఆమె బాటలో ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కాంతమ్మ, ఏవో భద్రప్ప, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

లక్ష్య సాధనకు ప్రణాళికలు సిద్ధం చేయండి

మహిళాశక్తి పథకం లక్ష్య సాధనకు ప్రణాళికలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మండలాల్లో యూనిట్లు, ప్రయోజనకరంగా నూతన ఆలోచనలతో దీర్ఘకాలం ఉపయోగకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా మైక్రో ఎంటర్‌ప్రైజేస్‌, స్కూల్‌ యూనిఫాం స్టిచింగ్‌, బ్యాక్‌యార్డ్‌ పౌల్ట్రీ, పౌల్ట్రీ మదర్‌యూనిట్లు, ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు, మిల్క్‌పార్లర్లు వంటి విభాగాల్లో నెలవారీగా యూనిట్లు గుర్తింపు, స్థాపన, లక్ష్యాలను సాధించేందుకు మండలాల వారీగా అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రౌండింగ్‌ కాకుండా పెండింగ్‌లో ఉన్న యూనిట్లు వెంటనే గ్రౌండింగ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు, ఎల్‌డీఎం అయ్యపురెడ్డి, పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, మత్య్సశాఖ అధికారి షకీలాభాను, ఇంచార్జీ డీఏఓ సక్రియానాయక్‌, ఏపీఎంలు, డీపీఎంలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement