పన్నుల వసూళ్లపై నజర్‌ | - | Sakshi
Sakshi News home page

పన్నుల వసూళ్లపై నజర్‌

Published Mon, Dec 9 2024 12:48 AM | Last Updated on Mon, Dec 9 2024 12:48 AM

పన్ను

పన్నుల వసూళ్లపై నజర్‌

గ్రామ పంచాయతీల్లో వంద శాతం వసూళ్లే లక్ష్యంగా ముందుకు..

జిల్లాలో పంచాయతీల లక్ష్యం వివరాలిలా..

మండలం మొత్తం లక్ష్యం

పంచాయతీలు (రూ.లక్షల్లో)

ఇటిక్యాల 29 44.27

ఉండవల్లి 16 43.10

గట్టు 27 42.50

మల్దకల్‌ 25 36.23

గద్వాల 28 35.93

అయిజ 28 35.34

ధరూరు 28 26.63

కేటీదొడ్డి 23 22.34

రాజోళి 11 20.55

మానవపాడు 16 19.78

అలంపూర్‌ 14 14.42

వడ్డేపల్లి 10 12.91

గద్వాల న్యూటౌన్‌: గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరు అయిన పన్నుల వసూలుపై అధికారులు దృష్టి సారించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను వసూళ్లను అక్టోబర్‌ రెండో వారం నుంచి ప్రారంభించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 40శాతం పన్ను వసూలు అయ్యింది. ఈ ఏడాది శతశాతం వసూలు అయ్యేలా సిబ్బందికి అధికారుల దిశా నిర్ధేశం చేశారు.

పన్నులు

వసూలు అయితేనే నిధులు..

గ్రామ పంచాయతీలు స్వయం పోషకాలుగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తుంటాయి. పంచాయతీలు ఇంటిపన్ను, తాగునీటిపన్నుతో పాటు వాణిజ్య దుకాణాలు, ఫ్యాక్టరీల నుంచి లైసెన్స్‌ ఫీజు వసూలు చేస్తాయి. ఈమేరకు పన్నులను గ్రామ కార్యదర్శులు వసూలు చేస్తారు. అయితే నిధుల కోసం పంచాయతీలు ఆరాట పడుతుంటాయి. ప్రభుత్వ పరంగా ఎస్‌ఎఫ్‌సీ, ఆర్థికసంఘం నుంచి మాత్రమే నిధులు మంజూరవుతాయి. ఇది కూడా జనాభా ప్రాతిపదికన రూ.2లక్షల లోపు మాత్రమే ఆయా పంచాయతీలకు వస్తుంటాయి. పలు అవసరాలకు పంచాయతీలకు పన్నుల రూపేణ వచ్చే సొమ్మే దిక్కు అవుతుంది. కేంద్రం కూడా వందశాతం పన్ను వసూలు అయితేనే ప్రత్యేకంగా గ్రాంట్లు ఇస్తామని చెప్పింది. ఇలాంటి పరిస్థితి వల్ల పంచాయతీలు పన్ను వసూళకలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి.

పెరిగిన డిమాండ్‌..

2022–23లో జిల్లా వ్యాప్తంగా 255 పంచాయతీల్లో రూ.2.35 కోట్లు ఉండగా, 2023–24లో రూ.3.37కోట్లకు చేరుకుంది. అంటే ఒక ఏడాదిలో దాదాపు రూ.1.2 కోట్లు పెరిగింది. దీనికి కారణాలు ఉన్నాయి. పలు గ్రామాల్లో మట్టి మిద్దెల స్థానంలో ఆర్‌సీసీ ఇళ్లు నిర్మించుకున్నారు. వీటికి రీఅసెస్‌మెంట్‌ చేసి, పన్ను పెంచారు. మండల కేంద్రాల్లో అసెస్‌మెంట్‌ లేని దుకాణాలను గుర్తించి, అసెస్‌మెంట్‌ చేసి పన్ను విధించారు. ప్రధానంగా ఎర్రవల్లి చౌరస్తా, అలంపూర్‌ చౌరస్తా, ధరూర్‌ మండల కేంద్రాల్లో పలు దుకాణాలకు కొత్తగా అసెస్‌మెంట్‌ చేసి, లైసెన్స్‌ ఫీజు విధించారు. దీంతో డిమాండ్‌ పెరిగింది. కాగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో పన్ను ఐదు శాతం పెంచుతారు. ఈక్రమంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో పన్ను లక్ష్యం రూ.3.54కోట్లుగా ఉంది.

అక్టోబర్‌ నుంచి వసూళ్లు ప్రారంభించిన కార్యదర్శులు

ఇప్పటివరకు 40 శాతం చేరిన వైనం

జిల్లాలో 255 పంచాయతీలు

లక్ష్య సాధనకు చర్యలు..

2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్లను అక్టోబర్‌ రెండో వారం నుంచి ప్రారంభించాం. ఇప్పటికి 40శాతం పన్నులు వసూలయ్యాయి. వందశాతం పన్నులు వసూలు అయ్యేలా అవసరమైన కార్యాచరణను సిబ్బందికి తెలియజేశాం. గడిచిన మూడేళ్ల నుంచి తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వల్ల డిమాండ్‌ పెరుగుతోంది.

– శ్యాంసుందర్‌, జిల్లా పంచాయతీ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
పన్నుల వసూళ్లపై నజర్‌ 1
1/2

పన్నుల వసూళ్లపై నజర్‌

పన్నుల వసూళ్లపై నజర్‌ 2
2/2

పన్నుల వసూళ్లపై నజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement