ప్రజలు భక్తిభావంతో మెలగాలి
గద్వాల (మల్దకల్): ప్రజలు భక్తి భావంతో మెలగాలని కర్ణాటక హంపీ పీఠాధిపతి విద్యారణ్యభారతిస్వామి భక్తులకు సూచించారు. ఆదివారం ఆదిశిలా క్షేత్రానికి చేరుకున్న పీఠాధిపతికి ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డితోపాటు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో మహాహోమం నిర్వహించారు. అలాగే సంస్థాన పూజలు నిర్వహించి భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు వినిపించారు. బ్రహ్మోత్సవాలకు ముందు ప్రతి ఏటా ఆదిశిలా వాసుడి క్షేత్రంలో స్వామిజీ సంస్థాన పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని, ప్రజలందరూ భక్తి మార్గంలో, సన్మార్గంలో నడుచుకోవాలని వివరించారు. ఇంట్లో ఉన్న దేవుడు ఇంటిల్లిపాదికి కుటుంబ క్షేమం చూస్తే, ఆలయంలో ఉన్న దేవుడు లోకాన్ని సంరక్షిస్తాడన్నారు. అనంతరం భక్తులు పీఠాధిపతిని సన్మానించగా భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మధుసూదన్‌రెడ్డి, సీతారామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, బాబురావు, ఆలయ అర్చకులు రమేషాచారి, మధుసూధనాచారి,రవిచారి,శశాంక్,దీరేంద్రదాసు, చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.
నేడు ఐటీఐ కళాశాలలో అప్రెంటీస్‌షిప్ మేళా
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: స్కిల్ ఇండియా–మేకిన్ ఇండియాలో భాగంగా జిల్లాకేంద్రంలోని ఐటీఐ కళాశాలలో సోమవారం ప్రధానమంత్రి జాతీయ అప్రెంటీస్‌షిప్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శాంతయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీల ప్రతినిధులు మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. పీఎంఎన్‌ఎం స్కీం ద్వారా ఐటీఐ, డిప్లమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు బయోడేటా, సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
పీయూలో యోగ,
అథ్లెటిక్స్ ఎంపికలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ యోగా, అథ్లెటిక్స్ పోటీలకు ఆదివారం ఎంపికలు నిర్వహించారు. పీయూ పరిధిలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఎంపికలకు హాజరయ్యారు. అథ్లెటిక్స్‌లో వివిధ విభాగాల్లో 24 మంది, యోగాలో ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేసినట్లు పీడీ శ్రీనివాస్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులు ఒడిశాలోని కేఐఐటీ, కేఐఎస్‌ఎస్ డీమ్డ్ యూనివర్సిటీలో ఈనెల 24 నుంచి 30 వరకు నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా పోటీల్లో పాల్గొని ఎంపికై న విద్యార్థులను ఎంఈడీ ప్రిన్సిపాల్ బషీర్ అహ్మద్ అభినందించారు. కార్యక్రమంలో కోచ్‌లు ఆనంద్, సునీల్, యుగేందర్, వెంకట్‌రెడ్డి, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ పాలనలో
వ్యవస్థలన్నీ నిర్వీర్యం
నాగర్‌కర్నూల్ క్రైం: బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ఏడాది క్రితం అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించామని టీపీసీసీ అధికార ప్రతినిధి లింగంయాదవ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏడాది ప్రజా పాలనపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 5 వేల స్కూళ్లను మూసివేస్తే కాంగ్రెస్ ఏడాది పాలనలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రారంభించడంతోపాటు కాస్మొటిక్, డైట్ చార్జీలను పెంచారన్నారు. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించిందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచామని, రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో కేసీఆర్ పదవిలలో చేయని అభివృద్ధిని ఏడాదిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపించారని అన్నారు. స్పోక్స్ పర్సన్ ఆచారి, రాజ్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment