ఆిస్త పన్ను వసూళ్లను కార్యదర్శులు అక్టోబర్ రెండో వారం నుంచి ప్రారంభించారు. ఇప్పటివరకు జిల్లా మొత్తం మీద 40 శాతం వసూలు చేశారు. వంద శాతం వసూలు అయ్యేలా అధికారులు సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఆయా గ్రామాల్లో కార్యదర్శులు కార్యాలయాల్లో పన్ను వసూలు చేయడంతో పాటు, ఇంటింటికి తిరిగి వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2017–18 నుంచి డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్‌ను ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఆయా గ్రామాల వారిగా ఆస్తి పన్ను వివరాలను ఈ వెబ్‌సైట్‌లో చేర్చారు. ఈ వెబ్‌సైట్‌లోని వివరాల ఆధారంగా డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్ (డీసీబీ) పత్రాలను ప్రింట్ తీసి ఈఓపీఆర్‌డీలు కార్యదర్శులకు అందజేశారు. ఈ ఏడాదిలో కొత్తగా ఇళ్లు, ఫ్యాక్టరీల నిర్మాణాలు జరిగి ఉంటే వాటి కొలతలు తీసుకొని, అదేవిధంగా కొత్త దుకాణాల లైసెన్స్ ఫీజు వివరాలను రికార్డులలో పొందుపర్చి ఇచ్చారు. అయితే పన్ను వసూలు చేసిన రశీదుల ఆధారంగా వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన టీఎస్ ఈ–పంచాయతీల వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. దీని ద్వార పన్ను వసూళ్ల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment