తమ ప్లాన్ ఆచరణలోకి రావాలనే ఉద్దేశంతో రోడ్డు వైపు ఉన్న మున్సిపల్ డ్రైనేజీ స్థలాన్ని ఆక్రమించారు. 20ఫీట్ల డ్రైనేజీని కాస్త పూర్తిగా తొలగించి 10ఫీట్ల సీసీ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. ఇక్కడ అప్పనంగా 10 ఫీట్ల మున్సిపల్ డ్రైనేజీ స్థలం కబ్జా చేసినట్లే. వాస్తవానికి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయాలంటే గతంలో ఎవరైనా వణికిపోయేవారు. కానీ, పరిస్థితి మొత్తం మారిపోయింది. రాజకీయ పలుకుబడితో నిబంధనలకు విరుద్ధంగా గద్వాలలో రూ.కోట్లు విలువు చేసే మున్సిపల్ స్థలాలను కబ్జా చేయడం ఆనవాయితీగా మారింది. ఇందులో భాగంగానే మున్సిపల్ అధికారులకు కనీస సమాచారం లేకుండా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రైవేటు వ్యక్తులు సొంతంగా మున్సిపల్ 20 ఫీట్ల డ్రైనేజీని తొలగించి దాని స్థానంలో 10ఫీట్ల డ్రైనేజీ నిర్మాణం చేపడుతూ మిగతా 10 ఫీట్ల స్థలాన్ని కాజేసే యత్నం చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన మున్సిపాలిటీలో ఇంత బహిరంగంగా ఆక్రమణలు జరుగుతుంటే చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు, ఉన్నతస్థాయి అధికారులు ఎవరు కూడా అటు వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఇదిలాఉండగా, చర్యలు తీసుకుంటే ఎక్కడ మా కుర్చీలు కదిలిపోతాయోననే భయంతో బెంబేలెత్తిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment