అలంపూర్ ఆలయాల హుండీ ఆదాయం రూ.1.06 కోట్లు
అలంపూర్: అష్టాదశ శకిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల హుండీ ఆదాయం రూ.1,06,04,436 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి పురేందర్‌కుమార్ తెలిపారు. అలంపూర్‌లో వెలసిన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాల హుండీ లెక్కింపు సోమవారం ఉమ్మడి జిల్లా దేవాదాయ సహాయ కమిషనర్ మధనేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా జోగుళాంబ అమ్మవారి ఆలయ హుండీ లెక్కించడంతో రూ.87,02,578 రాగా.. బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయ హుండీ ద్వారా రూ.18,63,642 ఆదా యం వచ్చిందన్నారు. అలాగే అన్నదాన సత్రం హుండీ ద్వారా రూ.38,216 మొత్తం కలిపి రూ.1,06,04,436 ఆదాయం వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. అదేవిధంగా విదేశీ కరెన్సీ యూఎస్ డాలర్లు 17, ఆస్ట్రేలియా కరెన్సీ 5, స్వీడన్ కరెన్సీ 1000, మిశ్రమ బంగారం 61 గ్రాములు, మిశ్రమ వెండి 513 గ్రాములు వచ్చింది. ప్రస్తుతం 150 రోజులకు సంబంధించిన హుండీని లెక్కించడంతో ఈ ఆదాయం సమకూరిందని వివరించారు. గతంలో 110 రోజుల హుండీ ఆదాయం లెక్కించగా రూ.58,66,623 వచ్చింది. అయితే ఈసారి కార్తీక మాసం కలిసి రావడంతో గతం కంటే రూ.47,37,813 ఆదాయం అదనంగా వచ్చిందని చెప్పారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి, ధర్మకర్తలు నాగశిరోమణి, జగన్‌మోహన్‌నాయుడు, విశ్వనాథరెడ్డి, జగదీశ్వర్‌గౌడ్, గోపాల్, వెంకటేశ్వర్లు, ఆలయ ఉప ప్రధాన అర్చకులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఆనంద్‌శర్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment