వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో భద్రాద్రి సీతారామలక్ష్మణ, మద్వాచారి భీమసేన విగ్రహాలను సోమవారం మంత్రాలయ పూర్వపు పీఠాధిపతి సువిదేంద్ర తీర్థులచే విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించారు. అంతకుముందు కల్యాణమండపంలో మహాహోమం, కుంభాభిషేకం, కలశప్రతిష్టలతో పాటు పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ చేపట్టారు. అనంతరం భద్రాద్రి సీతరామలక్ష్మణ, మద్వాచారిభీమసేన విగ్రహ ప్రతిష్టలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సువిదేంద్ర తీర్థులు భక్తులకు వేదప్రవచనాలు, ఆశీర్వచనాలు అందజేశారు. భక్తులు దైవమార్గంలో నడుచుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, విగ్రహ దాతలు పద్మారెడ్డి, బిచ్చారెడ్డి, నాయకులు మధుసూదన్‌రెడ్డి, సీతారామిరెడ్డి, రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నరేందర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
నేడు ధ్వజారోహణం
ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయ ఆవరణలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు తెలిపారు. ధ్వజారోహణంతో దేవతామూర్తులకు ఆహ్వానం పలుకుతూ ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నట్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment