సకాలంలో పన్నులు వసూలు చేయాలి
ఇటిక్యాల: గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ పన్నులను సకాలంలో వసూలు చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నీలి శ్రీనివాసులు అన్నారు. సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్ ఆద్వర్యంలో పంచాయతీ కార్యదర్శులకు పన్ను వసూలుపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో జిల్లా గ్రంథాలయ పన్నులు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయని, కార్యదర్శులు పన్నుల వసూలుపై ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే పూర్తి చేసి, సదరు వాటిని జిల్లా గ్రంథాలయ సంస్థకు జమ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయవాదులు
విధుల బహిష్కరణ
గద్వాల క్రైం: జిల్లా కోర్టు, ఇతర కార్యాలయాలను గద్వాల మండలం పూడూరుకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై నిరసనగా సోమవారం కోర్టు విధులను బహిష్కరించినట్లు గద్వాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురామిరెడ్డి, ఉపాధ్యక్షుడు ఖాజామొయిన్దున్, రాజు, ఆనంద్‌రావు, రామక్రిష్ణ, సురేష్‌గౌడ్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టు, ఈ సముదాయాలు గత కొన్ని సంవత్సరాలుగా కక్షిదారులకు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సమస్యాత్మకంగా ఉన్నాయని పేర్కొన్నారు. కోర్టు, ఇతర భవనాలను జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment