ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి
గద్వాల: సమస్యల పరిష్కారానికి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన ఫిర్యాదుదారులు వివిధ సమస్యలపై 42 ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. వీటిలో అత్యధికంగా భూసంబంధ సమస్యలు ఉన్నాయని వీటిని సంబంధిత అధికారులకు పంపినట్లు వచ్చిన ప్రతిఫిర్యాదుదారునికి పరిష్కారం చూపాలని లేనిపక్షంలో అందుకు గల కారణాలు తెలుపుతూ ఫిర్యాదుదారునికి అక్‌నాలెడ్జ్‌మెంట్ ద్వారా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాస్‌రావు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment