న్యాక్‌కు సన్నద్ధం
గ్రేడింగ్ పెరిగితే ప్రయోజనం..
యూనివర్సిటీకి గ్రేడింగ్ పెంచేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఐక్యూఏసీ (ఇంటర్నల్ క్వాలిటీ అసెస్‌మెంట్) సెల్ ఆధ్వర్యంలో వివిధ డిపార్ట్‌మెంట్ల అధ్యాపకుల సమక్షంలో ఐదేళ్లుగా చేసిన వివిధ యాక్టివిటీస్‌కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. అందులోభాగంగా స్పోర్ట్స్‌లో పాల్గొన్న విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ యాక్టివిటీస్, క్యాంపస్ సెలక్షన్స్, హాస్టల్స్ విద్యార్థులకు అందిస్తున్న వసతులు, లైబ్రరీలు, గ్రౌండ్, పీహెచ్‌డీ వివరాలతో పాటు వివిధ సెమినార్‌లు తదితర వివరాలను సేకరిస్తున్నారు. గతంలో ఉన్న వసతుల కంటే ఇప్పుడు మెరుగుపడిన నేపథ్యంలో ఏ ప్లస్ గ్రేడింగ్ వస్తే.. యూనివర్సిటీలో సొంతంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్‌లు ఏర్పాటు చేయవచ్చు. అంతర్జాతీయ యూనివర్సిటీతో ఎంఓయూలు చేసుకోవడం.. పీహెచ్‌డీ సీట్లు భర్తీ చేసుకోవడం.. పెద్ద ఎత్తున నిధులు రావడం వంటి ప్రయోజనాలు కలగనున్నాయి. వివిధ రీసెర్చ్ ప్రాజెక్టులు రావడంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
త్వరలో పాలమూరు
యూనివర్సిటీని సందర్శించనున్న న్యాక్ బృందం
● గతం కంటే మెరుగుపడిన వసతులు
● న్యాక్‌కు పూర్తి వివరాలతో రిపోర్టు ఇచ్చేందుకు కమిటీల ఏర్పాటు
● ఏ ప్లస్ గ్రేడింగ్ సాధించేందుకు ప్రయత్నం
● ఇప్పటికే వివిధ కేంద్ర సంస్థల నుంచి గుర్తింపు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా విద్యార్థుల వరప్రదాయిని పాలమూరు యూనివర్సిటీ. ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తూ.. ఏడాదికేడాది మరింత విస్తరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మరో పరీక్షకు పీయూ సిద్ధమైంది. ఈనెల రెండో వారం నుంచి వచ్చే నెలాఖరులోగా న్యాక్ (నేషనల్ అసెస్‌మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్) బృందం పీయూను సందర్శించనుంది. మూడు రోజుల పాటు ఆకస్మిక తనిఖీలు చేపట్టనుంది. అయితే ఇప్పటికే పీయూ అధికారులు ఆన్‌లైన్‌లో యూనివర్సిటీకి సంబంధించిన అన్ని అంశాల వివరాలను న్యాక్‌కు అందించారు. ఈ వివరాలు వాస్తవంగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని సంబంధిత అధికారులు పరిశీలించనున్నారు. 2018లో మొదటిసారి పీయూకు ‘బీ’ గ్రేడ్ రాగా.. ఈ సారి ఏ ప్లస్ సాధించే విధంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వివిధ గుర్తింపులు పొందిన పీయూకు న్యాక్ గ్రేడింగ్ పెరిగితే.. పనితీరుకు ఒక గుర్తింపు లభించడంతో పాటు రాష్ట్రంలోని పెద్ద యూనివర్సిటీల సరసన స్థానం పొందనుంది. పీయూ అభివృద్ధికి ప్రతి సంవత్సరం రూ.10 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉంది. పీయూ పరిధిలో వివిధ కళాశాలలు 120 వరకు ఉండగా.. 35 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు.
● పీయూలో మొదటిసారిగా 2018లో నిర్వహించిన న్యాక్ తనిఖీల్లో బీ–గ్రేడ్ సాధించగా.. రూసా (రారష్ట్‌రీయ ఉచ్చత్తర్ శిక్షా అభియాన్) ద్వారా యూనివర్సిటీకి రూ.20 కోట్లు మంజూరయ్యాయి.
●2015లో పీసీఐ (ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) నుంచి గుర్తింపు రావడంతో యూనివర్సిటీలో ఫార్మసీ కళాశాలను ప్రారంభించారు. పీయూ పరిధిలో డీ ఫార్మా, బీ ఫార్మా కోర్సులు అందిస్తున్నారు.
● 2016లో యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల అఫ్లియేషన్స్, వసతులను దృష్టిలో ఉంచుకుని 12బీ గుర్తింపును యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ప్రకటించింది.
● పీయూలో ఎంఈడీ కోర్సులను ప్రవేశ పెట్టేందుకు 2015లో ఎన్‌సీఈటీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచింగ్ ఎడ్యుకేషన్) గుర్తింపు లభించింది. దీంతో పీయూలో ఎంఈడీ కళాశాలను ప్రారంభించింది. బీఈడీ పూర్తి చేసిన వారికి ఎంఈడీ విద్య అందిస్తున్నారు. పీయూ పరిధిలో బీఈడీ కోర్సులను కూడా అందిస్తున్నారు.
● 2023లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి లా డిపార్ట్‌మెంట్ ఏర్పాటుకు అనుమతి వచ్చింది. దీంతో పీయూ పరిధిలోని వనపర్తి ప్రైవేటు కాలేజీలో లా కళాశాలను ఏర్పాటు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీయూలో కూడా లా అడ్మిషన్లు ఇవ్వనున్నారు.
● ఇంజినీరింగ్ కళాశాలను కూడా పీయూలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ అడ్మిషన్లు ఇవ్వనున్న నేపథ్యంలో ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్)కు దరఖాస్తులు చేయనున్నారు. కళాశాల ప్రారంభించిన నాలుగేళ్లలో ఈ గుర్తింపు రానుంది.
ఇప్పటికే పొందిన గుర్తింపులు..
ఉత్తమ గ్రేడింగ్ సాధించేందుకు చర్యలు..
గతంలో వచ్చిన గ్రేడింగ్ కంటే ఉత్తమ గ్రేడింగ్ సాధించేందుకు పకడ్బందీగా చర్య లు తీసుకుంటున్నాం. వచ్చే నెల వరకు న్యాక్ బృందం యూనివర్సిటీకి రానుంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఐదేళ్లతో పోల్చితే అనేక అభివృద్ధి పనులు జరగడం వల్ల న్యాక్ తనిఖీల్లో ఉత్త మ గ్రేడింగ్ సాధిస్తాం. రూసా నుంచి మంచి నిధు లు వచ్చే విధంగా సిబ్బందితో కలిసి కృషి చేస్తాం. విద్యార్థులకు పూర్తి స్థాయిలో వసతులు, నాణ్యమైన విద్య అందించేందుకు పాటుపడతాం.
– జీఎస్ శ్రీనివాస్,
వైస్‌చాన్స్‌లర్, పీయూ
Comments
Please login to add a commentAdd a comment